మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామేలు
Women Empowerment: మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ యొక్క లక్ష్యం అని ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు వడ్డీ లేని రుణాలను అందించకపోవడంతో మహిళా సమాఖ్యలు…
