Telangana Farmers | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…క్వింటాల్‌కు 500 బోనస్
Telangana Farmers: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పంపిణీని అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సన్న రకాల వడ్లను సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది….
