హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం – జిల్లాల వారీ షెడ్యూల్ వివరాలు
హనుమకొండ:డీడీజీ (స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్, చెన్నై మరియు డైరెక్టర్ రిక్రూటింగ్, ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సోమవారం ఉదయం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జేఎన్ఎస్) ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సుమారు ఉదయం 2:30 గంటలకు సైన్యాధికారుల సమక్షంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ మరియు వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల నుండి 794 మంది…
