ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష – బాధిత కుటుంబాలకు సంతాపం
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన తక్షణమే స్పందించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులతో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ, దర్యాప్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ గాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనకు కారణమైన…
