రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానున్నట్లు పండితులు తెలిపారు. జ్యోతిష్య గణనల ప్రకారం శుభాల అధిపతి అయిన గురు, శుక్రుడు, అలాగే గురుడు, ఈ కాలంలో సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతారు. దీని వల్ల వీరి శక్తి తగ్గిపోతుందనీ, శుభకార్యాలకు అవసరమైన దైవిక అనుగ్రహం తగ్గుతుందనే నమ్మకం ఉంది.
ALSO READ:Hyderabad Expansion: దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరణ
ఈ శుక్ర మౌఢ్యమి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుందని, మొత్తం 84 రోజులపాటు శుభకార్యాలకు ఇది అననుకూల సమయంగా పరిగణించబడుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు.
ఈ కాలంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, భూముల కొనుగోలు, బోర్లు తవ్వించడం, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం వంటి ముఖ్య కార్యక్రమాలను నివారించాలని సూచించారు. శుక్ర మౌఢ్యమి ప్రభావం నిత్యారాధన లేదా జరిగే సీమంత కార్యక్రమాలకు వర్తించదని స్పష్టం చేశారు.
శాస్త్రోక్తంగా శుభకార్యాలు ప్రారంభించేందుకు శుక్ర మౌఢ్యమి ముగిసే వరకు వేచి ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.









