Sheikh Hasina:బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష

Former Bangladeshi PM Sheikh Hasina during ICT tribunal verdict Former Bangladeshi PM Sheikh Hasina during ICT tribunal verdict

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది.గతంలో ఢాకాలో జరిగిన అల్లర్ల సమయంలో అమాయకులపై కాల్పులకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు, ఆమెనే ఈ ఘటనలకు ప్రధాన బాధ్యురాలని తేల్చింది.

ALSO READ:Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన 

ప్రజలపై దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ శక్తిని దుర్వినియోగం చేశారని, మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించారని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ఉన్న భౌతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాలు, సంఘటనల వీడియో ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు అత్యున్నత శిక్షగా మరణదండన ఖరారు చేసింది.

కొన్ని నెలల క్రితం దేశంలో అల్లర్లు చెలరేగిన సమయంలో హసీనా పదవి కోల్పోయి దేశం విడిచి వెళ్లగా, ప్రస్తుతం ఆమె భారతదేశంలో తాత్కాలిక ఆశ్రయం తీసుకుంటున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం ఆమె గైర్హాజరులోనే సాగింది. ఇచ్చిన ఆదేశాల వల్ల అనేకమంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని, ఇది ప్రజాస్వామ్యంపై నేరమని ICT కోర్టు వ్యాఖ్యానించింది.

తీర్పు వెలువడిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆమెపై కొనసాగుతున్న కేసులపై ఇంకా మరిన్ని చట్టపరమైన చర్యలు తిరిగి ప్రారంభం కానున్నట్టు అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *