Thursday, March 12, 2026
No menu items!
Home InterNational Russia Ukraine Conflict | శాంతి చర్చల ముందు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

Russia Ukraine Conflict | శాంతి చర్చల ముందు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

0
28
Russia Ukraine War
Russia launching drone and missile attacks on Ukraine cities damaging power infrastructure amid ongoing war tensions.

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా దళాలు తమ దేశంపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్లు, వివిధ రకాల 70 క్షిపణులను ప్రయోగించాయని ఆయన ఆరోపించారు.

కీవ్‌లో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ పర్యటనకు ముందు ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అబుధాబిలో అమెరికా మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలు ప్రారంభం కావాల్సిన సమయంలో రష్యా దాడులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి.

ఈ దాడుల్లో ముఖ్యంగా ఉక్రెయిన్(Ukraine) విద్యుత్ సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. చలికాలంలో విద్యుత్ అంతరాయం కలిగించడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో రష్యా దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.

దేశంలోని అయిదు ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఉక్రెయిన్ పవర్ నెట్‌వర్క్‌పై జరిగిన అతిపెద్ద దాడిగా ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని మిత్రదేశాలను ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతోంది.

YouTube thumbnailYouTube icon