రోడ్లపై ధాన్యం అరబెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో ఎవరివైతే ధాన్యం ఉంటుందో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం జరుగుతుందని దీంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాళీ ప్రదేశాలలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
ప్రమాదాలు జరిగితే ధాన్యానికి సంబంధించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలని ఎవరైనా ఫోన్లు చేసి లాటరీలు వచ్చాయని మభ్యపెట్టి కాల్ చేయడం జరుగుతుందని అదేవిధంగా కొందరు భయభ్రాంతులకు గురిచేసి మీ పేరు డ్రగ్ పార్సిల్ లో మీ ఆధార్ కార్డు నంబర్ ఉందని భయాన్ని గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని ఎవరికి ఎలాంటి బెదిరింపు కాల్ వచ్చిన, ఎవరైనా పోలీసులమని చెప్పి వీడియో కాల్ చేసినా కూడా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని, ఆయన తెలిపారు. ఏ పోలీస్ అధికారి కూడా డ్రగ్స్ పేరుతో ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం జరగదని, లాటరీ పేరు చెప్పి ముందు కొంత డబ్బును తమ ఖాతాలో జమ చేయాలని చెప్పి మభ్యపెట్టడం జరుగుతుందని ఎవరు కూడా అలాంటి దురాశకు వెళ్లకూడదని ఆయన సూచించారు.