గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. చరణ్ ఇమేజ్‌కి ఇది అసలైన మైలురాయిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వర్మ తన ట్వీట్‌లో “హేయ్ సానా బుచ్చిబాబు… రాజమౌళి నుంచి నాకు వరకూ ఎవ్వరం కూడా రామ్ చరణ్ శక్తిని నువ్వు అర్థం చేసుకున్నంతగా అర్థం చేసుకోలేకపోయాం. నీ సినిమా గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అంటూ తెలిపారు. ఈ మేరకు ‘పెද්ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను కూడా వర్మ షేర్ చేశారు.
ఇక చరణ్ గురించి మాట్లాడుతూ… “ఇతడు గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు… యూనివర్స్‌లో కూడ కనిపించే స్టార్. బుచ్చిబాబు చూపిన విజన్ చూస్తే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో టర్నింగ్ పాయింట్ అవుతుంది” అని అన్నారు. వర్మ ప్రశంసలు నెటిజన్స్‌ను ఆకట్టుకున్నాయి.
వర్మ ట్వీట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ‘పెద్ది’పై మరింత హైప్ పెరిగింది. బుచ్చిబాబు గత చిత్రం ‘ఉప్పెన’కు ఎంత భారీ స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఆయన కలసి పని చేస్తుండటంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.