రామగుండంలో అభివృద్ధి పనులపై సమీక్ష

Ramagundam MLA M.S. Raj Thakur emphasized the need for government organizations to address development and welfare programs in affected areas during a review meeting at the municipal office. Ramagundam MLA M.S. Raj Thakur emphasized the need for government organizations to address development and welfare programs in affected areas during a review meeting at the municipal office.

ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ రంగ సంస్థలు పట్టించుకోవాలని రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు పరిసర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ నిర్లక్ష్యం కారణంగా జల,వాయు,శబ్ద కాలుష్యంతో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తమ పరిధిలోకి వచ్చే డివిజన్లు ,గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు నిర్వహణ , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులను ఆదేశించారు. నగరంలో అస్తవ్యస్తoగా వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయాలని ఆదేశించారు.

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.వీధి వ్యాపారులను గుర్తించి వారి వ్యాపారం సజావుగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశిoచారు. పచ్చదనం పెంపొందించి , ఎల్ ఇ డి లైట్లు ఏర్పాటు చేసి, ఐలాండ్ లు ఏర్పాటు చేసి నగర సుందరీకరణ పనులు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. నగరంలో రాముని గుండాలు, జనగామ శివాలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు , ఎల్లంపల్లి, సుందిళ్ల రిజర్వాయర్లు, ఉపరితల,భూగర్భ బొగ్గు గనులు,గోదావరినది ఉన్నందున అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఒక బృహత్ ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

ఐ డి ఎస్ ఎం టి షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరించి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.నగరంలో టి యు ఎఫ్ ఐ డి సి , డి ఎం ఎఫ్ టి , ఎస్ డి ఎఫ్ తదితర పథకాలతో చేపట్టిన పనుల పురోగతి సమీక్షించారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, అదనపు కలెక్టర్, కమీషనర్ (ఎఫ్ ఎ సి) అరుణ శ్రీ, ఆర్ ఎఫ్ సి ఎల్ జనరల్ మేనేజర్ ప్రదీప్ వర్షె, సింగరేణి ఆర్ జి వన్ జిఎం లలిత్ కుమార్, నగర పాలక సంస్థ ఎస్ ఈ శివానంద్, సెక్రెటరీ రాజు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్ ,ముస్తఫా, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య ,పెద్దెల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *