రెవెన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకల సందడి

Minister Ponguleti Srinivasa Reddy's birthday saw grand celebrations across Khammam district with blood donation camps, cake cutting, and charity events Minister Ponguleti Srinivasa Reddy's birthday saw grand celebrations across Khammam district with blood donation camps, cake cutting, and charity events

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఇంచార్జీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆప్యాయంగా శీనన్న అని పిలుచుకునే రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అభిమానంతో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదానం కార్యక్రమాలు, కేక్ కటింగ్ లు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజల గుండెల్లో నిలిచిన శీనన్న ప్రజల దీవెనలతో గెలిచి మంత్రి అయ్యారని అదే దీవెనలతో భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలకు మరింత సేవ చేస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *