గుమ్మడిదొడ్డి ఇథానాల్ కంపెనీ కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన గుమ్మళ్ళ దొడ్డి గ్రామస్తులు దీంతో గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కాలుష్య రహిత పరిశ్రమ అస్సాగో ఇండస్ట్రీస్ ఇథానాల్ కంపెనీ గొలగించాలి అని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామానికి చెందిన పలువురు రోడ్డు పై ధర్నా చేపట్టారు.
మండు టెండను సైతం లెక్కచేయ కుండా సుమారు 200 మంది వరకు గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పలువురు ఆందోళన చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు భారీగా అంతరాయం జరిగింది సుమారు గంటసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
రోడ్డుపై ఆందోళన సమాచారం అందుకున్న గోకవరం పోలీసులు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళనను విరమింప చేశారు. అనంతరం ఆందోళన కారులు రోడ్డుపై నుండి బయలుదేరి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వారి దగ్గరికి వెళ్లి తమ సంఘీభావాన్ని తెలిపారు.