తూర్పుగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ సంఖ్యలో అక్కడికి రావడంతో.
ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
ఈ సమయంలో పెందుర్తి వర్గానికి చెందిన నేతలను ఎయిర్‌పోర్టు లోనికి అనుమతించగా, బొడ్డు వర్గానికి చెందిన నాయకులను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తమను ఎయిర్‌పోర్టు ప్రవేశం వద్ద ఆపడం అన్యాయం అని బొడ్డు వర్గం నేతలు ఆందోళనకు దిగడంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కొద్ది సేపు వాగ్వాదం కొనసాగగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను విడదీశారు. పవన్ పర్యటనలో ఏర్పడిన ఈ ఉద్రిక్తతపై అధికారులు అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తున్నారు.
