Pakistan Drone in Jammu Kashmir:జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్  కలకలం

Pakistan drone spotted over Regal village in Jammu Kashmir’s Samba district Pakistan drone spotted over Regal village in Jammu Kashmir’s Samba district

జమ్ముకశ్మీర్లో కనిపించిన పాకిస్థాన్ డ్రోన్….చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళితే…
Jammu Kashmir Drone:జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ మానవరహిత డ్రోన్.. చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు.

ఘగ్వాల్ సెక్టార్‌లోని రీగల్ గ్రామం పైన డ్రోన్ కొన్ని నిమిషాలు హోవర్ అవుతూ సంచరించిందని వివరించారు. అనంతరం మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి వెనుతిరిగిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి.

also read:శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు..వీడియో వైరల్


డ్రోన్ సంచారం గమనించిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై, ఆ ప్రాంతమంతా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనను అధికారులు అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *