గాంధారి టౌన్ లో గల మారుతీ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ & ఎంపీ సురేష్ శేట్కార్ , కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ & డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం జరిగింది.
గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్ & వైస్ చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్ , గాంధారి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక MLA మదన్ మోహన రావు మాట్లాడుతూ ముందుగా గాంధారి మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రైతులకు , అధికారులకు , కాంగ్రెస్ నాయకులకు , కార్యకర్తలకు , పత్రిక మిత్రులకు నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లకు అభినందనలు , వీరి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంది రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటున్నాను