శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మూసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతు మాధవన్ వెల్లడించారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎస్ కోట మండలం బొడ్డవర కు చెందిన వై ఎస్ ఆర్ సిపి తొలగించిన ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు..
ఈ సందర్భంగా ఇందుకూరి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ…..
న్యాయపోరాటంలో భాగంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్దలందరూ సహకారం ఉంటుందని ఒకవేళ ఎలక్షన్ వెళ్లేటట్టుగా అయితే
గెలుపు అయితే న్యాయం వైపే ఉంటుందని నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే151 సీట్లు11 కు పరిమితమైన పరిస్థితి మరి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం వైపే ప్రజలు నిలబడతారని మా అందరికి కూడా ప్రజల సపోర్ట్ ఉంటుందని మేమైతే నమ్ముతున్నాం..