తమిళ నటి నయనతార సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, ఆమె నటించిన ‘టెస్ట్’ సినిమా అనేక కారణాలతో థియేట్రికల్ రిలీజ్‌ను మిస్ చేసింది. దీంతో చిత్రబృందం ఓటీటీ విడుదలకే మొగ్గుచూపింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహించాడు. మాధవన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో నటించగా, మీరా జాస్మిన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
కథ విషయానికి వస్తే, చెన్నైలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న వేళ, ముగ్గురు వ్యక్తులు ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియానికి వెళతారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో వారు తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుంటారు. వారి జీవితాల్లో చోటుచేసుకున్న మలుపులు, వారి కష్టాలను ఎలా అధిగమిస్తారనే అంశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ సినిమా కథలోని వినూత్నత, నయనతార లాంటి స్టార్ కాస్టింగ్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేట్రికల్ రిలీజ్ కోల్పోయినప్పటికీ, ఓటీటీ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులకు చేరువ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.