చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్స్ డాలర్ల స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ ఎకానమీ… అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావటం దారుణం
ప్రజలను మభ్య పెట్టే మాయ మాటలు చెప్పటం పచ్చ మీడియాకు అలవాటైపోయింది
జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు…
విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోని ఆమోదం తెలిపారు కొత్తగా వీరు చేసింది ఏమీ లేదు…
వాల్తేర్ డివిజన్ పై మాత్రం క్లారిటీ ఇవ్వాలి… మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు… కచ్చితంగా రివిజన్ చేయాలి
పోలవరం గురించి కేంద్రం ఆమోదించింది ఎంత..?…
నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది
కాఫర్ డ్యామ్ లు, ప్రాజెక్టులో ఇతర పనులు త్వరిత గతిన ప్రారంభించాలి
గతంలో బస్సులు పెట్టి ప్రాజెక్టును చూపించడానికే చంద్రబాబు 24 కోట్లు ఖర్చు చేశారు..
దారి తప్పిన ఎమ్మెల్యేలనే వార్త పచ్చ పత్రికైన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది…
సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారో లేక మీ ఎమ్మెల్యేలకు, వందిమాగధులకు సృష్టిస్తున్నారో తెలియాలి…
తెలంగాణలో ఒక్కో షాపుకు 48 టెండర్లు పడితే ఆంధ్రాలో ఒక్కో షాపుకు మూడు టెండర్లు పడటం విచిత్రంగా ఉంది..
ప్రభుత్వ ఖజానాకు టిడిపి ఎమ్మెల్యేలు వారి బినామీలు గండి కొడుతున్నారు
కనీసం లక్ష టెండర్లు పడాల్సి ఉండగా పదో వంతు కూడా పడకుండా టిడిపి నేతలు అడ్డుకున్నారు …దీని ద్వారా ఖజానాకు రావలసిన 2000 కోట్లు కు గండిపడింది
ఉచిత ఇసుక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది…
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఉచిత ఇసుక పథకంలో ఉచితం పాత్ర కూడా అంతే…
బోట్ మెన్ సొసైటీలకు కేటాయించే టన్నుకు 340 రూపాయలు టిడిపి ఎమ్మెల్యేలకు, నేతలకు వెళ్ళటం నిజం కాదా…
ఉచిత ఇసుక అంతా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంది
ఫ్రీ శాండ్ ఎక్కడ దొరుకుతుంది….
ఇల్లు కట్టుకోవటానికి ఒక్కొక్క లారీ 28 వేల రూపాయల పెట్టి ఇసుక మేమే కొనుగోలు చేయాల్సి వచ్చింది
ఆన్లైన్ వెబ్సైట్ అసలు ఎంతసేపు పని చేస్తుంది? ఎప్పుడు పని చేస్తుంది…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణమైన పరిస్థితుల్లో ఉంది