బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుటకు మార్కింగ్ చేసినటువంటి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ BRS రాష్ట్ర పార్టీ స్టేషన్గన్పూర్ ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, గారి పిలుపుమేరకు ఈ రోజు ఉదయం 11 :00 గంటలకు జనగాం జిల్లా BRS పార్టీ కార్యాలయం నందు రఘునాథ మండల BRS పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్. గారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయుట జరిగినది,
ఈ కార్యక్రమానికి మండల సీనియర్ నాయకులు గూడ కిరణ్ కుమార్, ఉద్యమకారులు ఐల్లయ్య, కావాట్టి రాజయ్య, పతేషాపూర్ BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యామంకి కృష్ణ, రఘు, పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.