విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి హైస్కూల్లో మంగళవారం 8వతరగతి విద్యార్థిని యవర్న మౌనిక అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21న నెల్లిమర్ల మండలం రఘుమండలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మౌనిక ప్రతిభ చాటింది. గతంలో మౌనిక నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. మౌనికను పీడీ చాపాన పోలమాంబను శాలువు, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, ఎంపికైన మౌనికను జయతి గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, చాపాన నారాయణరావు, మన్నెపురి అప్పలనాయుడు, ఉపాధ్యాయులు నాగమణి, టి అశోక్ కుమార్, కెపివి శ్రీనివాసరావు,సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు.
మౌనిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
