వెనెజువెలా విపక్ష నేత “మారియా కొరీనా మచాడో”(Maria Corina Machado) తమకు లభించిన “నోబెల్ శాంతి బహుమతిని” అమెరికా అధ్యక్షుడు “Donald Trump” కు గురువారం అందజేశారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛకోసం చేసిన ట్రంప్ ప్రయత్నాలను గుర్తించిన విధంగా ఈ అవార్డు సమర్పించినట్లు మచాడో చెప్పారు.
ట్రంప్ గతంలో తనకే కాక, శాంతి బహుమతికి అర్హులెవరూ లేరని కూడా ప్రకటనలు చేశారు.
ALSO READ:మళ్లీ భారీగా పెరిగిన వెండి ధరలు…బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఎంతంటే ?
మచాడో నుంచి అవార్డును స్వీకరించిన తర్వాత ట్రంప్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘మచాడోను కలుసుకోవడం గొప్ప గౌరవం. తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ఆమె నాకు సమర్పించింది. ధన్యవాదాలు మారియా’’ అని “ట్రూత్ సోషల్” లో పోస్టు చేశారు.
అయితే, నోబెల్ కమిటీ స్పష్టంగా చెప్పింది – నోబెల్ ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదు.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మచాడో అవార్డు సమర్పించడం “ప్రత్యక్ష అధికారిక గుర్తింపు” కాదని నిపుణులు వివరిస్తున్నారు.
