Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadSinger Mangli | మంగ్లీపై చీటింగ్ కేసు... ఆర్థిక మోసం అంటూ కేసు నమోదు

Singer Mangli | మంగ్లీపై చీటింగ్ కేసు… ఆర్థిక మోసం అంటూ కేసు నమోదు

-

Chat on WhatsApp

Singer Mangli: టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీపై రూ.10 కోట్ల చీటింగ్ కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తనను భారీ ఆర్థిక మోసానికి గురిచేశారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదులో బాధితుడు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరియు మరో ముగ్గురిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. సుమారు రూ.10 కోట్ల మేర ఆర్థిక మోసం జరగడంతో పాటు తనకు ప్రాణహాని ఉందని కూడా ఆరోపించడం ఈ కేసును మరింత కీలకంగా మార్చింది.

అందిన ఆధారాల ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే గతంలో కూడా కొన్ని వివాదాల్లో మంగ్లీ పేరు వినిపించినప్పటికీ, ఈ స్థాయి ఆర్థిక మోసం ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో ఆమె కెరీర్‌పై ఈ కేసు ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

అయితే కెరీర్ పీక్ దశలో ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు మంగ్లీ లేదా ఆమె టీమ్ నుంచి అధికారిక స్పందన రాలేదు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp