Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌కు చేరుకున్నారు. “THE GOAT Tour” కార్యక్రమంలో భాగంగా ఆయన తొలి దశలో కొలకత్తాకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. 14 ఏళ్ల విరామం తర్వాత మెస్సీ భారత పర్యటన జరుపుతుండటంతో, ఆయన రాకను అభిమానులు ఘనంగా స్వాగతించారు.
ALSO READ:డెడ్ చీప్‌గా T20 World Cup 2026 టికెట్లు…ఎంత అంటే ?
విమానాశ్రయం నుంచి హోటల్ వరకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మెస్సీ(Lionel Messi) రాకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఇది మరో గుర్తుండిపోయే ఘట్టంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.
మెస్సీ పర్యటనలో భాగంగా కొలకత్తాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పలు ఈవెంట్లు, ఫుట్‌బాల్(Foot Ball) సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
ఈ పర్యటన ద్వారా భారత ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మెస్సీ రాకతో దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
