అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ కళ్యాణ ప్రాంగణంలో గోదావరి జిల్లాల 4000 మంది మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహాయజ్ఞం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. భక్తుల ఉత్సాహాన్ని అభినందించిన ఆయన, లలితా సహస్రనామం పారాయణం మహిళల్లో భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దొరిశాల బాలాజీ మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల దాతల సహాయంతో ఈ యజ్ఞం నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల బస్సులతో సహకరించిన విద్యా సంస్థలు అమలాపురం భి వి సి, నర్సాపూర్ స్వర్నాద్ర, పాలకొల్లు శశి, శ్రీవాణి, ఏ ఎఫ్ డీ టి, గుర్రవయ్య, భాష్యం, గౌతమి మోడల్, వేద, ఎడ్యూకర్, పద్మావతి, మాంటిస్టోరీ విద్యా సంస్థలు విశేషంగా సహాయ సహకారాలు అందించాయి. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఎన్డీయే కూటమి నాయకులు, గ్రామస్థులు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్వేది ఆలయంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు.