మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ పిలుపుమేరకు మహేశ్వరం నియోజకవర్గంలో గల తుక్కుగూడ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమిత్ షాను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. “అంబేద్కర్ రాజ్యాంగం రూపకర్తగా, బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్య్రం ఇచ్చిన మహానీయుడు. ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అమిత్ షా అహంకారానికి నిదర్శనమని” ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, దళిత, బహుజన నాయకులతో కలిసి లక్ష్మారెడ్డి, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దృష్టిలో బడుగు బలహీన వర్గాల కోసం సాధించిన అర్హతలు పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దళిత, బహుజన సంఘాలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.