ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ గారు అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT) ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి CAAAM (Center for Agile and Adaptive Additive Manufacturing) సంస్థను పరిశీలించారు.
ఈ కేంద్రంలో జరుగుతున్న ఆధునిక పరిశోధనలు, తయారీ రంగంలో వినియోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ, పరికరాలను ఆయన పరిశీలించారు. వివిధ విభాగాల్లో జరిగిన ఇన్నోవేషన్లు, పరిశోధనలు యువతకు ఉపయుక్తంగా ఉండేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యావ్యవస్థలో అమెరికాలో అవలంబిస్తున్న పద్ధతులు, తయారీ రంగ టెక్నాలజీలను భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు. ఇందుకోసం NRI మిత్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ యూనివర్సిటీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పలువురు స్థానిక తెలుగువారు కూడా ఉన్నారు.