“పల్లె పండుగ” కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్

Former Minister Kondru Murali Mohan emphasized the impact of the "Palle Panduga" program in promoting rural development in Rajam constituency. He announced free gas cylinders for women as a Diwali gift. Former Minister Kondru Murali Mohan emphasized the impact of the "Palle Panduga" program in promoting rural development in Rajam constituency. He announced free gas cylinders for women as a Diwali gift.

విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో “పల్లె పండుగ%”
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.

మంగళవారం నాడు రేగిడి ఆమదాల వలస మండలంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేసేందుకు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని తెలిపారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ది దిశగా పరుగులు తీస్తుండటంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *