Kalvakuntla Kavitha: తెలంగాణలో విద్యావ్యవస్థలో మార్పుల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు రద్దు ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి చెబుతున్న డ్రాప్‌అవుట్ల గణాంకాలు పూర్తిస్థాయి వాస్తవాలను ప్రతిబింబించడం లేదని ఆమె అన్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో చేరేవారిలో కేవలం 60 శాతం మంది మాత్రమే కొనసాగుతున్నారన్న లెక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినదై ఉండొచ్చని, మొత్తం విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే డ్రాప్‌అవుట్ల శాతం 16 మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో లేదా ఇతర కోర్సుల్లో చేరడాన్ని కూడా డ్రాప్‌అవుట్లుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్‌గా భావించకూడదని హితవు పలికారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు డ్రాప్‌అవుట్లు లేని విద్యలో తెలంగాణ టాప్-5లో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్యలో 28వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అంగీకరించబోమని హెచ్చరించారు. విద్యా సంస్కరణలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరగాలని, గణాంకాల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
డ్రాప్ ఔట్స్ పేరుతో ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కలు తప్పు
పది తరగతి తర్వాత ఇంటర్ కు వెళ్తున్న వారిలో 10 లో ఆరుగురు మాత్రమే ఉంటున్నారని అంటున్నారు కానీ అది గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థుల లెక్క అయి ఉండొచ్చు పూర్తిగా ఓవరాల్ గా చూస్తే మాత్రం… pic.twitter.com/Dv4J6hxH2K
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గా భావించొద్దు
1వ తరగతి నుంచి 10తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేకుండా చదువుతున్న ర్యాకింగ్స్ లో మనం టాప్ 5 లో ఉన్నాం కానీ నాణ్యమైన చదువులో మాత్రం మన ర్యాంక్ 28 వ స్థానంలో ఉంది