చిన్న శంకరంపేట మండలం జంగారై సోసైటీ ఆధ్వర్యంలో జంగా రాయి, చందాపూర్, గవలపల్లి, అంబాజీపేట, కొరివి పల్లి, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తీర్న నాధికారి శ్యామ్ లు మాట్లాడుతూ రైతులు దళారులనునమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని వారు తెలిపారు ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని అదేవిధంగా సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు, రైతులు పండించిన ప్రతి చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్యామ్, సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, సీఈఓ బాలకిష్టయ్య, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జంగారై సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
