Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు మరోసారి థియేటర్లు దద్దరిల్లే టైమ్ వచ్చేసింది. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన అధికారిక థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ను కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘జైలర్ 2’ పేరుతో పలు ఫ్యాన్ మేడ్, కాన్సెప్ట్ ట్రైలర్లు వైరల్ అవుతున్నాయి. అయితే అక్టోబర్ 5న రానున్నదే అసలైన అధికారిక ట్రైలర్ అని మేకర్స్ స్పష్టం చేశారు.
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ మరోసారి ప్రేక్షకులను ముత్తువేల్ పాండియన్గా అలరించనున్నారు. తొలి భాగంలో ఈ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన ‘హుకుమ్ రీలోడెడ్’ థీమ్ సాంగ్ మంచి హైప్ తీసుకొచ్చింది. తారాగణం కూడా ఈసారి మరింత భారీగా ఉంది. ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా తమ పాత్రల్లో సందడి చేయనున్నారు. వీరితో పాటు విజయ్ సేతుపతి ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మాస్ హీరో రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌కు అనిరుధ్ సంగీతం, భారీ తారాగణం తోడవడంతో ‘జైలర్ 2’పై ఆసక్తి మరింత పెరిగింది. అక్టోబర్ 5న ట్రైలర్ విడుదల తర్వాత ఈ హైప్ మరింత పెరగనుంది.
ALSO READ: Telangana auto rickshaw charges | ఆటో ఎక్కితే ఇక జేబుకు మోత.. కొత్త ఛార్జీలు ఇవే
