మంత్రాలు చేస్తుందని ఓ మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక మహిళను కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు అన్న సమాచారం మాకు వచ్చిందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్రాల గ్రామానికి చెందిన ముత్తవ్వ (45 ) అనే మహిళ కు మంత్రాలు వస్తాయని మరో మహిళ ఆమెపై ఆరోపణలు చేసింది.తర్వాత ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి ఆమెను అడిగి కొంతమంది కొట్టారు. దాంతో ముతవ్వ క్రింద పడిపోయింది.దాంట్లో ఒక వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారని పేర్కొన్నారు.ఇది హేయమైన చర్య ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని ,ఇలాంటివి మనసులో పెట్టుకొని ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దని ఆయన ప్రజలకు తెలిపారు. ఇలాంటి చర్య జరగడం మొదటి సారన్నారు. ఈ విషయం మాకు మొదటి తెలిస్తే మేము ఇలా జరగనిచ్చే వారం కామని ఆయన అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు పోలీసు కళాబృందాల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రాలు ఉన్నాయని మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ప్రజలకు రామాయంపేట మండలంలో గ్రామాల్లో పోలీసు కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.ఈ విషయంలో ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు.
మెదక్ జిల్లాలో పెట్రోల్ పోసి మహిళను తగలబెట్టిన ఘటన
