రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఐకెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చిన్న శంకరంపేట మండల ఐకెపి ఎపిఎం లక్ష్మీనారాయణ అన్నారు. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఐకెపి ఎపిఎం లక్ష్మినారాయణ లు ప్రారంభించారు. అనంతరం ఏపీఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐకెపి ఆధ్వర్యంలో చిన్న శంకరంపేట మండలంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, రైతులకు మేలు చేయాలని ఉదేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విక్రయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రారం మాజీ సర్పంచ్ లక్ష్మణ్,ఐకెపి ఎపిఎం లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి అనురాధ, ఐకెపి సిసి రాజు, తదితరులు పాల్గొన్నారు.
రైతుల కోసం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
