Sunday, March 22, 2026
Google search engine
HomeInterNationalBangladesh T20 World Cup Contraversy: భారతదేశంలో ఆడకపోతే బంగ్లాదేశ్ అవుట్.. వేరే జట్టుకు  అవకాశం...

Bangladesh T20 World Cup Contraversy: భారతదేశంలో ఆడకపోతే బంగ్లాదేశ్ అవుట్.. వేరే జట్టుకు  అవకాశం ఇస్తాం..ICC వార్నింగ్ 

-

Google search engine

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ వేదిక విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వైఖరిపై ఐసీసీ(ICC) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌లో వరల్డ్ కప్ మ్యాచులు మేము ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించడంతో వివాదం తలెత్తింది.

భద్రతా లేదు అనే కారణాలను చూపుతూ, తమ T20 లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంక(srilanka)కు తరలించాలని ఐసీసీని బంగ్లా బోర్డు కోరింది.

అయితే, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ప్రతిపాదనపై నిర్వహించిన ఓటింగ్‌లో 14–2 ఓట్ల తేడాతో ఐసీసీ బోర్డు తిరస్కరించినట్లు సమాచారం.

ALSO READ:Putin on Greenland: అమెరికా ఆరోపణలపై స్పందించిన పుతిన్…గ్రీన్‌లాండ్ తో రష్యాకు సంబంధం లేదు

భారత్‌లో ఆడటానికి నిరాకరిస్తే, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చుతామని ఐసీసీ హెచ్చరించింది.

ఓటింగ్ ఫలితాలను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఐసీసీ బీసీబీని కోరింది. తుది నిర్ణయం తెలియజేయడానికి మరో రోజు గడువు ఇచ్చింది.

బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హాజరైన 15 మంది డైరెక్టర్లలో కేవలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రమే బంగ్లాదేశ్‌కు మద్దతు తెలిపినట్లు తెలిసింది.

టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒక లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్‌లతో కలిసి గ్రూప్ సిలో ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ వైదొలిగితే, స్కాట్లాండ్ గ్రూప్ సిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine