Monday, March 2, 2026
No menu items!
Google search engine
HomeTelanganaHyderabadiBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

- Advertisement -
Google search engine

iBomma Ravi: పైరసీ సినిమాల కేసులో అరెస్టైన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు  I Bomma Ravi విచారణలో అనేక కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. రెండో రోజు విచారణలో మధ్యాహ్నం తర్వాత రవి నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు.

విదేశీ పౌరసత్వం ఉన్న కారణంగా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్లు తెలిసింది.
గత ఆరేళ్లుగా ఎవరూ తనను పట్టుకోలేకపోవడం వల్ల ధైర్యం పెరిగి, దేశ, విదేశాల్లో తన పైరసీ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు రవి చెప్పినట్టు సమాచారం.

“మొదట్లో కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చేశాను. చేస్తున్నది తప్పని గ్రహించలేదు” అంటూ విచారణలో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచి విడుదలైన తరువాత పూర్తిగా మారిపోతానని, ఇకపై పైరసీ కార్యకలాపాల్లో పాల్గొననని రవి పోలీసులకు హామీ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో, కేసులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. రవికి దేశ, విదేశాల్లో ఉన్న ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో నమోదుచేస్తున్నారు.

ALSO READ:పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి  

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular