దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించబోతుంది. హైదరాబాద్ మహానగరాన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా రూపుదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని భారీ స్థాయిలో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఈ క్రమంలో GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు మరియు ORRను ఆనుకుని ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలో చేర్చే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ:Constitution Day 2025: డిజిటల్ రాజ్యాంగాన్ని 9 భాషల్లో విడుదల
త్వరలోనే డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికార వర్గాలు పరిశీలిస్తున్నాయి. వచ్చే 1–2 నెలల్లో ఈ విభజన, విలీనాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
విస్తరణ ప్రణాళిక అమల్లోకి వస్తే హైదరాబాద్ నగర పరిధి 2,735 చదరపు కి.మీకి చేరుకుంటుంది. ఈ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుంది.
ప్రస్తుతం GHMC పరిధి 625 చదరపు కి.మీ ఉండగా, ప్రతిపాదిత విస్తరణతో నగర పరిమాణం నాలుగు రెట్లు పెరగనుంది. మెట్రో నగర అభివృద్ధి, మౌలిక వసతులు, రవాణా, ప్రాంతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
