హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలోనే 4,000 కుక్క కాట్ల (Hyderabad dog bites) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు(stray dogs) మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రధానంగా బాధితులుగా మారుతున్నారని సమాచారం.
GHMC అధికారులు కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో కుక్కలను పట్టుకునే ప్రత్యేక బృందాలు మోహరించగా, నివాస ప్రాంతాల్లో కుక్కలకు ఆహారం వేస్తున్న వారిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కుక్కను బెదిరించకూడదని, దానికి రాళ్లు వేయడం లేదా వెంటపడటం వంటి చర్యలు చేయరాదని సూచించారు.
సమస్య ఎదురైన వెంటనే “GHMC హెల్ప్‌లైన్ 040-21111111” నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజల సహకారం లేకుండా కుక్కల నియంత్రణ సాధ్యం కాదని, ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
ALSO READ:KCR High Court Order:కాళేశ్వరం అవకతవకల కేసులో కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం
