Friday, March 6, 2026
No menu items!
Google search engine
HomeTelanganaHyderabadHyderabad Cyber Scam | డెంటల్ డాక్టర్‌ను టార్గెట్ చేసిన సైబర్ గ్యాంగ్...14 కోట్లు మాయం

Hyderabad Cyber Scam | డెంటల్ డాక్టర్‌ను టార్గెట్ చేసిన సైబర్ గ్యాంగ్…14 కోట్లు మాయం

- Advertisement -
Google search engine

Hyderabad Cyber Scam: హైదరాబాద్‌లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు 14 కోట్ల రూపాయల మేరకు మోసగించారు. సంప్రదాయ దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోతున్న వేళ సైబర్ మోసాలు మాత్రం భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో “మౌనిక” అనే పేరుతో ఓ మహిళ డాక్టర్‌ను సంప్రదించింది. తాను కష్టాల్లో ఉన్నానని భావోద్వేగ పూరిత సందేశాలతో నమ్మకం కల్పించింది.

ALSO READ:Bapatla Police Warning | తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు 

తదనంతరం ఆన్‌లైన్‌ స్టాక్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో భారీ లాభాలు వస్తాయని డాక్టర్‌ను ప్రలోభపరిచింది. నిందితులు ప్రత్యేకంగా ఓ క్రిప్టో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయించి, నకిలీ లావాదేవీలను చూపిస్తూ నమ్మకం పెంచారు.

తరువాత లాభాలను విత్‌డ్రా చేసుకోవాలంటే పన్నుల పేరుతో చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారు. ట్యాక్స్‌గా ఇప్పటికే మూడున్నర కోట్లు చెల్లించినప్పటికీ డాక్టర్‌కు ఎలాంటి డబ్బులు తిరిగి రాలేదు.

మొత్తం 91 సార్లు వివిధ మార్గాల్లో డాక్టర్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు రాకపోవడంతో బాధితుడు టీఎస్ సైబర్ బ్యూరోను సంప్రదించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల తీవ్రతను మరోసారి బయటపెడుతోంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular