Friday, April 17, 2026
Chat on WhatsApp
HomeNationalHelicopter Crash | ఇండోనేషియాలో విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో 8 మంది మృతి

Helicopter Crash | ఇండోనేషియాలో విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో 8 మంది మృతి

-

Chat on WhatsApp

Helicopter Crash: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్‌లోని మెలావి జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి నేలకూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

హెలికాప్టర్ ప్రమాదంపై అధికారుల విచారణ ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు కారణమా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో ఇండోనేషియా విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.


ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనతో ఇండోనేషియాలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

papam prathap movie review

Papam Prathap Movie Review | పాపం ప్రతాప్…అయ్యో కొట్టాడుగా హిట్టు 

తిరువీర్ హీరోగా వచ్చిన పాపం ప్రతాప్ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథలతో గుర్తింపు పొందిన తిరువీర్ మరోసారి సున్నితమైన లవ్-ఎమోషనల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102