గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు మెరుపు దాడులు చేయగా ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈగలు టీం అందించిన సమాచారం ఆధారంగా సౌత్ డీఎస్పీ బాణోదయ పర్యవేక్షణలో పోలీసులు 11 గ్రాముల MDM డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాల్ (22), బత్తుల శ్రీనివాస్ (23)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు శ్రీనివాస్ 11 గ్రాముల 30,000 రూ MDM మత్తు పదార్థాన్ని గుంటూరు కి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తున్న సమయంలో పట్టుబడ్డారు. ఈ సరఫరా కోసం ఖాజా వీరికి ₹2,000 సుపారీ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఖాజా మరియు విజయ్ సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ డ్రగ్ సరఫరా నెట్వర్క్‌పై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని డీఎస్పీ తెలిపారు.పోలీసులు ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకుని దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.
also read:Australia vs England 1st Test: స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల..ఇంగ్లాండ్ 172కే ఆల్ అవుట్
