నెల్లూరు రూరల్ పొట్టే పాలెం సమీపంలో జెట్టి నవీన్ కుమార్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గార్డెన్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవాన్ని బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నారాయణ హాస్పిటల్ డీజీఎం అలిమిలి చంద్రశేఖర్ రెడ్డి, టిడిపి నేత ఇందుపూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి, గార్డెన్ నీడ్స్ అధినేత గౌతమ్ మల్హోత్రా, రవి గార్డెన్స్ అధినేత రవి, శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు కుంచాల విజయ్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి సుజిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. నవీన్ రెడ్డి నర్సరీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గార్డెన్ వరల్డ్ అధినేత జెట్టి నవీన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలన్న సమున్నత లక్ష్యంతో గార్డెన్ వరల్డ్ ను స్థాపించామన్నారు. తమ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మొక్కలను విద్యాలయాలు, ఆలయాలు వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రజలకు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గార్డెన్ వరల్డ్ లో ఇండోర్ ఔట్ డోర్ మొక్కలకు 10 శాతం నుంచి 50% రాయితీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.