Full Snow Moon :2026 ఫిబ్రవరి 1న ఆకాశంలో ఫిబ్రవరి నెల ఫుల్ స్నో మూన్ అద్భుతంగా దర్శనమివ్వనుంది. ఇది సాధారణ పౌర్ణమి కాదు. ఈ ఫుల్ మూన్ బీహైవ్ క్లస్టర్‌కి కిందగా ఉదయించనుండటమే దీని ప్రత్యేకత. భూమికి దగ్గరగా ఉన్న ఓపెన్ స్టార్ క్లస్టర్లలో బీహైవ్ క్లస్టర్ ఒకటి కావడంతో, రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం కనిపించనుంది.
ఈస్టర్న్ టైమ్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5:09కి చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తే, అదే భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3:39కి ఫుల్ మూన్ పీక్‌కు చేరుకుంటుంది.
ఉత్తరార్థగోళంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ సమయంలో చంద్రుడు హోరిజన్‌కి దిగువన ఉన్నా, భారత్‌లో మాత్రం తెల్లవారుజామున లేచి చూస్తే అత్యంత ప్రకాశవంతమైన చంద్రుడిని వీక్షించవచ్చు. ఫిబ్రవరి 1కి ముందు, తర్వాత ఒకటి రెండు రోజులు కూడా ఈ స్నో మూన్ దాదాపు పౌర్ణమిలానే కనిపిస్తుంది.
ఫిబ్రవరి 1 రాత్రి ఈ ఏడాదిలోనే అత్యంత వెలుగైన రాత్రుల్లో ఒకటిగా నిలవనుంది. ఇది సూపర్ మూన్ కాకపోయినా, మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రకాంతి మరింత ప్రకాశవంతంగా ప్రతిఫలిస్తుంది. నాసా ప్రకారం, మంచుకు అధిక అల్బీడో ఉండటంతో 90 శాతం కంటే ఎక్కువ కాంతిని తిరిగి ప్రతిబింబిస్తుంది.
ఇంకో విశేషం ఏమిటంటే, ఫిబ్రవరి 2న రెగ్యూలస్ నక్షత్రం కొంతసేపు చంద్రుడి వెనుక దాగిపోవడం. దీనిని లూనార్ ఆకల్టేషన్ అంటారు. ఇలాంటి అరుదైన దృశ్యం మళ్లీ 2030ల వరకు కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫిబ్రవరి నెలలో మంచు అధికంగా కురిసే కాలం కావడంతోనే ఈ పౌర్ణమికి ‘స్నో మూన్’ అనే పేరు వచ్చింది.








