ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులనికి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపి రామసహయం రఘురాం రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పట్ల పేద ప్రజలందరికీ అందేలా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలో అమ్మ ఆదర్శ పథకం ద్వారా పాఠశాలలలో మౌళిక వసతులు కల్పించిందని అన్నారు. గడిచిన 10 సం లలో టీచర్స్ బదిలీలు, ప్రమోషన్ల ఇవ్వలేదని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసిందని అన్నారు. గత ప్రభుత్వం 10 సం లలో కేవలం 7 వేల టీచర్స్ ఇస్తే, మన ప్రభుత్వం 11 వేల టీచర్స్ పోస్టులు భర్తీ చేసిందని అన్నారు. గత ప్రభుత్వం రెసిడెన్సీ పాఠశాలలను అద్దే భవనాలలో ఏర్పాటు చేస్తే, ఇందిరమ్మ రాజ్యంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలని నిర్మిస్తుందని అన్నారు. అన్ని కులాల విద్యార్థులకి 125 కోట్లతో 1300 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాలను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇస్తూ, అన్ని మౌళిక వసతులు కల్పిస్తుందని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కల్పించేలా చేస్తుందని అన్నారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. ప్రైవేట్ సెక్టారు లో ఎలాంటి వసతులు ఉన్నాయో, అలాంటి వసతులు మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటాయని అన్నారు.