Friday, March 6, 2026
No menu items!
Google search engine
HomeAndhra Pradeshkakinada fire accident |  కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..38 పూరిళ్లు ?

kakinada fire accident |  కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..38 పూరిళ్లు ?

- Advertisement -
Google search engine

Kakinada News: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో జరిగిన అగ్ని(Massive Fire in Kakinada) ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ తండాలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో నిమిషాల వ్యవధిలోనే గ్రామం భస్మమైంది.

ఈ ప్రమాదంలో 3 పక్కా ఇళ్లు మినహా మొత్తం 38 పూరిళ్లు(38 Huts Burnt) పూర్తిగా కాలిపోయాయి.

అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ALSO READ:Andhra Pradesh Launches Space City:ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ సిటీకి శ్రీకారం

సంక్రాంతి పండుగ సందర్భంగా అవసరమైన సరుకుల కొనుగోళ్ల కోసం గ్రామస్థులు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి గ్రామమంతా అగ్నికి ఆహుతై శ్మశానంలా మారి కనిపించింది.

ఇళ్లతో పాటు గృహోపకరణాలు, బియ్యం, ధాన్యం, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. బాధిత కుటుంబాలు రాత్రంతా తెరిచి ఉన్న ఆకాశం కింద గడిపినట్లు సమాచారం.

ఘటనపై అధికారులకు సమాచారం అందించగా, సహాయక చర్యలు ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular