8 వ తేదీన, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా ఆదేశాల ప్రకారం, చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చింతలపూడి మండలం పతంగులగూడెం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చింతలపూడి స్టేషన్ CI, SI లు, ESTF, ఏలూరు SI మరియు సిబ్బంది, మరియు VRO శ్రీమతి.జల్లిపల్లి రజినీ కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి సమయంలో పతంగులగూడెం గ్రామంలో 10 లీటర్ల నాటు సారాయి మరియు నాటు సారాయి తయారీకి ఉపయోగపడే 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పులిసిన బెల్లపు ఊటను హాసావత్ నాగేశ్వరరావు గల పొలంలో పూర్తిగా ధ్వంసం చేసి, హాసావత్ వెంకటేశ్వర్లు మరియు హాసావత్ వెంకన్న అనే ముగ్గురు వ్యక్తులపై స్థానిక ఎక్సైజ్ స్టేషన్ చింతలపూడి పరారీ కేసు నమోదు చేసింది. వీరంతా నాటు సారాయి తయారీ మరియు విక్రయంలో పాల్గొంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడిలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ. లు ఆర్.వి.యల్. నరసింహా రావు, అబ్దుల్ ఖలీల్, ESTF, ఏలూరు ఎస్.ఐ. ఎం.డి.ఆరిఫ్ మరియు స్టేషన్/ESTF సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ CI పి.అశోక్ ఈ విషయాన్ని ప్రకటించారు.