పత్తిపాడు కేంద్రంలోని రూ. 12 లక్షల విలువైన సి.సి రోడ్డు సోమవారం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
4 కి.మీ. మేర భారీ ర్యాలీ
సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెమ్మసాని గారికి నియోజకవర్గంలోని కోయ వారిపాలెం మొదలు ప్రత్తిపాడు టౌన్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
ర్యాలీలో భాగంగా తమకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని గారు మాట్లాడారు.
రహదారి ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు ఇంతటి ఘనస్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. మీ అభిమానానికి ఎప్పుడూ మేము దాసులమే.
ఎన్నడూ లేనంత మెజారిటీతో నన్ను గెలిపించారు. గుంటూరు పార్లమెంట్ ప్రజలందరూ ‘మా పెమ్మసాని’ అనేంత గర్వంగా గుంటూరులో కేంద్ర మంత్రిగా అడుగుపెట్టాను.
గుంటూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం అదే స్థాయిలో కష్టపడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో అద్భుత రీతిలో గ్రాంట్లు రాబట్టగలిగాం.
కొందరు దాన్ని అప్పు అంటున్నారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చూడండి, ఇది అప్పో, గ్రాంటో తెలుస్తుంది.
రూ. 15 వేల కోట్ల నిధులతో ఒక మహానగరం రాబోతుంది. రూ. 25వేల కోట్ల పైబడి నిధులతో రైల్వే లైన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ ను చూసినా ఒక్కో రైల్వే లైన్ ను రూ. 4-5 కోట్లతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే కృషి రాబోయే మీ తరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజినరీతో ఆలోచన చేశారు అంటే అది ప్రజాభివృద్ధి కోసమే తప్ప మరేమీ కాదు అని ఎన్నికల ముందే చెప్పాం.
వినుకొండ మీదుగా నాలుగు లైన్ల జాతీయ రహదారిని వినుకొండ, తాడికొండ మీదుగా అమరావతిలో కలుపుబోతున్నాం.
ఐదేళ్ళుగా ఆగిపోయిన వంద పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రిని నిరంతరం కృషి చేసి ప్రత్తిపాడుకు తిరిగి వెనకకు తీసుకువస్తున్నాం.
30 ఏళ్లుగా ఎవరి వల్ల అవ్వని శంకర్ విలాస్ వంతెనను గుంటూరుకు అందిస్తున్నాం.
ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగు నెలల్లోని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి నేతృత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం.
ఎన్నికల ముందు వరకు ఎక్కడ చూసినా గంజాయి కనిపించేది. నిజాయితీగా పనిచేసే ఒక ఎస్పిని మన జిల్లాకు తీసుకువచ్చి గంజాయి కనిపించకుండా చేశాం.
గత ఐదేళ్లలో ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. త్వరలోనే మన ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు మరమ్మతులు ప్రారంభమవుతున్నాయి.
గుంటూరు ఛానల్ గుంటూరు ట్రైన్ నల్లమడ ట్రైన్ సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
రాబోయే 40 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తాం.
ఇటీవల కురిసిన వరదలకు మన ప్రాంతంలో చాలా ఏరియాల్లో నీట మునగగా, ఎవరు ఊహించని రీతిలో విరాళాల రూపేనా అందరూ బాబు గారికి సహకరించారు ఇలాంటి ఘనత కేవలం చంద్రబాబునాయుడు గారికి మాత్రమే దక్కుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారితో పాటు టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ప్రత్తిపాడు జనసేన ఇంచార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు, టిడిపి మండల ధ్యక్షుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.