Iran War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ (Iran)తో జరుగుతున్న యుద్ధం మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’(Operation Epic Fury) పూర్తి స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ ‘‘ఖమేనీ” ప్రేరేపణతో తనపై గతంలో రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు.
యుద్ధం క్లిష్టమైనదే అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కు తీవ్రతను కొనసాగించడం కష్టమేమీ కాదన్నారు. అయితే దౌత్య మార్గాలు ఇంకా తెరిచే ఉన్నాయని, చర్చలు జరిగే అవకాశాన్ని పూర్తిగా త్రోసిపుచ్చలేమన్నారు.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు అమెరికాకు చెందిన ముగ్గురు సైనికులు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్(United States Central Command) ధ్రువీకరించింది. తమ సైనికుల మృతికి ప్రతీకారం తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు.
దాడుల్లో ఇరాన్‌లో సుమారు 200 మంది మృతి చెందినట్లు సమాచారం. ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వదిలేస్తే రక్షణ కల్పిస్తామని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్‌కు దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం ఉండటం అమెరికా భద్రతకు ముప్పని, దాన్ని అడ్డుకోవడమే లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. లక్ష్యాలు నెరవేరే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ALSO READ:హైదరాబాద్ లో UBOC 13వ జనరల్ బాడీ సమావేశం








