శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ డ్రైవర్లు, కోవిడ్ కార్మికులు మరియు అదనపు కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ కో కన్వీనర్ టి,అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబు ముకుంద, ఇంజనీరింగ్ కార్మిక నాయకులు బొగ్గు నాగరాజు, అనిల్, మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో జనాభాను బట్టి కార్మిక సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని ,ఈఎస్ఐ ఆసుపత్రిని ధర్మవరంలో కేటాయించాలని, క్లాప్ డ్రైవర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పనిముట్లను ఇవ్వాలని, రిపేరులో ఉండి పనిచేయని వాహనాలను రిపేరు చేయించాలని, కోవిడ్ కార్మికులను, అదనపు కార్మికులను ఆప్కాస్ లోకి చేర్చాలని, కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ , ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ వర్తింపచేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది గా కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం కార్మిక సమస్యలకు సంబంధించి అనేక హామీలు ఇవ్వడం జరిగినదని వాటన్నిటికీ చట్టబద్ధత కల్పించే విధంగా వెంటనే జీవోలను విడుదల చేయాలని , వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ డ్రైవర్లు, కోవిడ్ కార్మికులు, పాల్గొన్నారు.
ధర్మవరం మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమం
