Dhanam Nagender Resignation | రాజీనామా చేసే యోచనలో ఖైరతాబాద్ MLA

Khairatabad MLA Dhanam Nagender facing resignation speculation after Speaker notices Khairatabad MLA Dhanam Nagender facing resignation speculation after Speaker notices

Khairatabad MLA Dhanam Nagender:తెలంగాణ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో, కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇందులో  దానం నాగేందర్ స్పీకర్‌కు వివరణ పంపకపోవడంతో మరోసారి నోటీసు అందినట్టు సమాచారం.

ALSO READ:వందేమాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత – జేవన్ కిమ్ వీడియో వైరల్ 

లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌(Dhanam Nagender)పై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లో ప్రతికూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

అలాంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడకుండా ఉండేందుకు రాజీనామా ఒక పరిష్కారమా అనే అంశంపై దానం ఆలోచిస్తున్నారన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు ఖైరతాబాద్ రాజకీయాలకు కొత్త మలుపు తేవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *