విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఎన్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి నూతన భవనం ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు మెరుగైన సౌకర్యాలు ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆషాడే కార్యక్రమం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఓ ఆనంద్, పిహెచ్సి డాక్టర్ ఉషారాణి, హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ తనిఖీ
