శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం లోని అనంత సాగరం గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తాదులకు అమ్మవారు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంత సాగరం గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ ఆలయం 2018 సంవత్సరం నందు ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా అమ్మవారిని ఆలయ పూజారి దేవరకొండ రామలింగయ్య, మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దసరా పండగ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుందని, అదేవిధంగా పండగ చివర రోజు అమ్మవారిని పల్లకిలో పురవీధుల గుండా ఊరేగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగింది.
అనంతసాగరం గ్రామంలో దుర్గాదేవి అలంకారంలో దసరా ఉత్సవాలు
